Govt Warn | కేంద్ర ప్రభుత్వం ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్ విషయంలో అడ్వైజరీ జారీ చేసింది. చూసేందుకు యాప్‌లు నిజంగానే అలాగే కనిపిస్తాయని.. వాటి ఉద్దేశం సమాచారాన్ని దొంగిలించడమేనని పేర్కొంది. దాంతో యూజర్ల గోప్యత, డేటా ప్రమాదంలో పడడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ కింద పని చేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ ‘సైబర్ దోస్త్’ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రమాదకరమైన యాప్‌ల వివరాలను సైతం షేర్ చేసింది. యాప్‌లలో చాలా వరకు విదేశాలతో సంబంధాలున్నట్లుగా పేర్కొంది.
ఈ యాప్స్ జాబితాలో ఇన్వాయిసర్ ఎక్స్పర్ట్ (Invoicer Experts), లోన్ రైనా ఇన్స్టంట్ లోన్ ఆన్లైన్ (Loan Raina – Instant Loan Online), గుప్తా క్రెడిట్ (Gupta Credit – Safe and Handy), గ్రేంట్స్విఫ్ట్ (GranetSwift), లోన్క్యూ (LoanQ | Financial Calculator), క్రెడిట్ఎడ్జ్ (CreditEdge), అల్టిమేట్ లెండ్ (Ultimate Lend), స్మార్ట్‌రిచ్ ప్రొ (SmartRich Pro), క్రెడిట్లెన్స్ (CreditLens), క్యాష్‌లోన్ (Cash Loan – EMI Calculator) ఉన్నాయి. ఏవైనా యాప్స్‌ను డౌన్లోడ్ చేసే ముందు వాటి గురించి పరిశీలించాలని.. ఆర్బీఐ ఆమోదం ఉన్న లోన్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చే ముందు తప్పనిసరిగా యాప్ గురించి ఆరా తీయాలని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రభుత్వం కీలక హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ కాల్ చేస్తున్న సమయంలో ఇంటర్నెట్ ఆన్‌లో ఉంచడం వల్ల మీ ఫోన్లో మాట్లాడే మాటలు వినేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. ఏవైనా యాప్‌లకు మైక్రోఫోన్ యాక్సెస్ అనుమతి ఇచ్చారా? లేదా? తెలుసుకోవడం వివరించింది. గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మైక్రోఫోన్‌ను పర్మిషన్ను చెక్ చేసుకోవాలని సూచించింది.
1/2
Think twice before you tap ‘Download’.Some apps aren’t just fake — they’re a threat to your data, money, and privacy.
Many of these have been traced to hostile foreign entities.
1. Check the app’s authenticity
2. Stick to RBI-verified loan platforms… pic.twitter.com/scNVz6sZjn— CyberDost I4C (@Cyberdost) June 13, 2025