ఫోన్ స్క్రీన్‌తో తగ్గుతున్న ఆయువు
- జీవ క్రియలకూ అవాంతరాలు
- జీవ గడియారంలో మార్పులు
- పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 11: ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు పొద్దున్న లేవగానే స్మార్ట్‌ఫోన్ పట్టాల్సిందే. ఆ తర్వాతే వేరే ఏ పనైనా.. ఇలా ఎక్కువ సేపు ఫోన్ స్క్రీన్‌ను చూస్తే కండ్ల సమస్యలు వస్తాయనే విషయం ఇప్పటి వరకు తెలిసిందే. కానీ, ఫోన్‌ను ఎక్కువ సేపు వాడటం వల్ల ఆయువు తగ్గిపోతుందని అమెరికాలోని బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసర్చ్ ఆన్ ఏజింగ్‌లో సంస్థ నిపుణుల అధ్యయనంలో తేలింది.
కండ్లు చాలా ప్రత్యేకం..
శరీరంలోని అన్ని భాగాలను చర్మం కప్పి ఉంచుతుంది. అయితే కండ్లు మాత్రమే బాహ్య ప్రపంచానికి నేరుగా ఎక్స్పోజ్ అవుతాయి. అందుకే వాటిని బయటి వాతావరణం నుంచి కాపాడుకునేందుకు కండ్లలో వ్యాధి నిరోధక శక్తి మిగతా అవయవాల కన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. తరచూ ఫోన్ తెరను చూస్తే కండ్లపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణ సమయాల్లోనే కండ్లను కాపాడుకునేందుకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంటుంది. ఇక ఫోన్ తెరను తరుచూ చూస్తే వ్యాధి నిరోధక శక్తి మరింత ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
జీవ క్రియలకు అవరోధం..
ఫోన్లు, కంప్యూటర్లను చూడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అతిగా స్పందిస్తుంటుంది. దీనివల్ల శరీరంలోని అంతర్గతంగా జరిగే ఇతర జీవ క్రియలపై ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా అవయవాలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికోసం ఈగల కండ్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.
జీవగడియారానికి ఆటంకం..
శరీరంలోని ప్రతి కణం కూడా జీవ గడియారానికి అనుగుణంగా పనిచేస్తుంటుంది. తరచూ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను చూడటం ద్వారా ఈ గడియారానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో జీవగడియారంలో మార్పులు జరిగి, దీర్ఘకాలిక వ్యాధులు మరింత ముదిరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కణాలు త్వరగా అలసిపోతాయని, తద్వారా మొత్తం అవయవ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడి ఆయుష్షు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.
ఈగలపై పరిశోధన ఇలా..
ఈగలను పరిశోధకులు రెండు గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపు ఈగలకు అన్ని రకాల ఆహారాన్ని అందించారు. రెండో గ్రూపు వాటికి కేవలం 10% ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని అందజేశారు. రెండో గ్రూపు ఈగల్లోని కండ్లల్లోని ఫొటో రిసెప్టార్లు ఎక్కువగా క్రియాశీలం అయ్యాయి. చీకట్లో ఉంచిన ఈగలు మిగిలిన ఈగల కన్నా ఎక్కువ కాలం జీవించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Life Span
- Phone screen
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

