గంటన్నరలో 48 వేలు ఖర్చు
మద్యం మత్తులో లగ్జరీ కారును నడిపి ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలి తీసుకున్న పుణెకు చెందిన టీనేజర్ ఆ ప్రమాదానికి ముందు పబ్‌లో కేవలం 90 నిమిషాల్లో 48 వేలు ఖర్చు చేశాడు. ప్రమాదానికి ముందు అతడు స్నేహితులతో కలిసి రెండు పబ్‌ల్లో మద్యం సేవించాడు.
- పుణె టీనేజర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి
- బెయిల్ రద్దు చేసిన కోర్టు.. అబ్జర్వేషన్ హోంకు తరలింపు
- 25 ఏండ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వొద్దని నిర్ణయం
పుణె, మే 22: మద్యం మత్తులో లగ్జరీ కారును నడిపి ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలి తీసుకున్న పుణెకు చెందిన టీనేజర్ ఆ ప్రమాదానికి ముందు పబ్‌లో కేవలం 90 నిమిషాల్లో 48 వేలు ఖర్చు చేశాడు. ప్రమాదానికి ముందు అతడు స్నేహితులతో కలిసి రెండు పబ్‌ల్లో మద్యం సేవించాడు. దీంతో, మైనర్లకు మద్యం సరఫరా చేసిన ఈ రెండు పబ్‌లను మంగళవారం సీజ్ చేసినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. పరారీలో ఉన్న టీనేజర్ తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే పబ్ ఓనర్‌తో పాటు ఒక ఉద్యోగిని అరెస్ట్ చేశారు. మరోవైపు జువైనెల్ కోర్టు టీనేజర్ బెయిల్‌ను రద్దు చేసి జూన్ 5 వరకు అతడిని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచాలని ఆదేశించింది.
ఇద్దరి ప్రాణాలు తీసినా.. వ్యాసం రాయమని బెయిల్ ఇచ్చారు
నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు యువ ఉద్యోగులను పొట్టనబెట్టుకున్న టీనేజర్‌కు ఆ రోజే న్యాయస్ధానం బెయిల్ మంజూరు చేయడం అందరినీ షాక్‌నకు గురి చేసింది. రోడ్డు ప్రమాదాలపై ఒక వ్యాసం రాయమని చెప్పిన జువైనల్ జస్టిస్ బోర్డు(జేజేబీ).. అది రాసిన వెంటనే బెయిల్ మంజూరు చేయడాన్ని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. జేజేబీ అతి విశాల హృదయంతో బెయిల్ మంజూరు చేయడం పట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, నిందితుడికి 25 ఏండ్ల వయసు వచ్చేవరకు అతడికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరాదంటూ మహారాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. అలాగే ప్రమాదానికి కారణమైన లగ్జరీ కారు పోర్సే టేకాన్‌కు సంబంధించిన ఫీజు చెల్లించనందున దాని పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెప్పారు. కాగా, బాలుడి తాతయ్యకు అండర్‌వరల్డ్ డాన్ చోటారాజన్‌తో లింక్ ఉన్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

