న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం(Delhi CM) రేఖా గుప్తాను చంపేస్తామంటూ ఇటీవల బెదిరింపులు వచ్చాయి. అయితే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. అతన్ని శ్లోక్ త్రిపాఠిగా గుర్తించారు. అతనో ఫ్రాడ్ అని తెలిసింది. తరుచూ అతను తన పేర్లను మారుస్తుంటాడని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ సెల్ పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి నిందితుడు ఆ బెదిరింపు చేశాడు. ఢిల్లీ పోలీసులకు ఘజియాబాద్ పోలీసులు అలర్ట్ చేశారు. పంచవటి కాలనీకి పోలీసుల బృందాన్ని పంపించారు. అయితే అక్కడ నుంచి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు ఘజియాబాద్ ఏసీపీ తెలిపారు.