9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులోమదురై కోర్టు సంచలన తీర్పు
తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తమిళనాడులోని మదురై మొదటి తరగతి జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది.
మదురై: తండ్రీ కొడుకుల లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ తమిళనాడులోని మదురై మొదటి తరగతి జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. అలాగే వారికి రూ.కోటి జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి ఆ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. కొవిడ్ సమయంలో తమ దుకాణాన్ని తెరచి ఉంచారన్న ఆరోపణలపై జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ను తుత్తుకూడి జిల్లా సాతన్కుళం పోలీసులు 2020 జూన్ 19న స్టేషన్‌కు తీసుకు వచ్చారు.
ఆ రోజు రాత్రంతా వారిని చితకబాది మరునాడు కోవిపట్టి సబ్‌జైల్‌కు తరలించారు. తీవ్ర గాయాలతో కోవిపట్టి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ బెనిక్స్ జూన్ 22న మరణించగా, అతని తండ్రి జయరాజ్ ఆ మరునాడు కన్నుమూశాడు. దీంతో కేసు విచారించిన జడ్జి జీ ముత్తుకుమారన్ అప్పటి స్టేషన్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లను నిందితులుగా పేర్కొంటూ వారికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
‘దొరికింది దొరికినట్లే దోచుకుంటున్నారు’
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

