Weeding | న్యూఢిల్లీ: మరి కాసేపట్లో పెండ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు స్నేహితుల అభ్యర్థన మేరకు ఓ సినిమా పాటకు కాలు కదిపి పెండ్లిని కాలదన్నుకున్నాడు! ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గత నెల 18న ఢిల్లీలో పెండ్లి వేడుకలో స్నేహితుల అభ్యర్థన మేరకు వరుడు ‘చోలీకే పీచే క్యా హై’ హిందీ సినిమా పాటకు కాసేపు సరదాగా డ్యాన్స్ చేశారు.
అయితే వరుడి ప్రవర్తన తమ కుటుంబ విలువలను అవమానించేలా ఉందని వధువు తండ్రి కోప్పడ్డారు. వెంటనే పెండ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కన్నీళ్ల పర్యంతమైన వధువు తన తండ్రికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించి విఫలమైంది.