ముంబై: ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దళిత వితంతువును నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. (Dalit Widow Beaten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పన్వన్ గ్రామానికి చెందిన దళిత వితంతువు పశువుల దాణా కోసం దేవదాస్ నరాలే అనే వ్యక్తికి రూ.2,000 ఇచ్చింది. అయితే పశువుల మేతను అతడు సరఫరా చేయలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.2,000 తిరిగి ఇవ్వాలని నరాలేను అడిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు మరో ముగ్గురితో కలిసి ఆ దళిత మహిళపై దాడి చేశాడు. అంతా చూస్తుండగా ఆమెను రోడ్డుపై పడేసి నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. కాళ్లతో తన్నాడు.
కాగా, ఈ నెల 26న జరిగిన ఈ సంఘటనను కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వంచిత్ బహుజన్ అఘాడి అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు పాల్పడిన ఈ దారుణాన్ని ఆయన ఖండించారు. బాధిత దళిత వితంతు మహిళకు న్యాయం జరుగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు బాధిత దళిత మహిళ కుమారుడు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు దేవదాస్ నరాలేతోపాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
It does not stop, does it?
A helpless Dalit widow was brutally beaten by a group of men in Satara, Maharashtra.
Her crime? She demanded her own money back which she paid for undelivered goods — fodder.
The video of the physical abuse is so disturbing that I am struggling to… pic.twitter.com/PUoywPtGon
— Prakash Ambedkar (@Prksh_Ambedkar) August 31, 2023