న్యూఢిల్లీ : ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా బుధవారం వ్యక్తిగతంగా రామన్ మెగసెసె అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ఆయనకు 1959లో ప్రకటించారు. ఆయన తరఫున దలైలామా సోదరుడు 1959 పురస్కారాన్ని అందుకున్నారు. అయితే 64 ఏండ్ల తర్వాత రామన్ మెగసెసె ఫౌండేషన్ ప్రతినిధులు స్వయంగా హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని దలైలామా నివాసానికి వచ్చి ఈ అవార్డును ఆయనకు బహూకరించారు. జీవన విధానం, సంస్కృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి నాయకత్వం వహించినందుకు దలైలామాకు ఈ అవార్డును అందించారు. ఇది దలైలామాకు వచ్చిన మొదటి అంతర్జాతీయ అవార్డని ఆయన కార్యాలయం తెలిపింది.