ముంబై: మహా రాష్ట్రలోని ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం వివిధ ఆపరేషన్లలో రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముంబై ఎయిర్పోర్టులో ఒక్క రోజులో కస్టమ్స్ అధికారులు ఇంత భారీమొత్తంలో బంగారాన్ని సీజ్ చేయడం చరిత్రలో తొలిసారి.
బంగారం అక్రమ తరలి ంపునకు సంబంధించి ఇద్దరు మహిళ లతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.