MIT | న్యూఢిల్లీ: భవన నిర్మాణ రంగంలో వాడుతున్న కాంక్రీట్ విప్లవాత్మక మార్పులను తీసుకురాబోతున్నది. డాక్టర్ డేమియన్ స్టెఫానియుక్ ఆధ్వర్యంలో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధక బృందం దీని కోసం కృషి చేస్తున్నది. ఎంఐటీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనల్లో కాంక్రీట్‌ను విద్యుత్తు నిల్వ సాధనంగా ఉపయోగించవచ్చునని గుర్తించారు.
సిమెంట్, నీరు, కార్బన్ బ్లాక్‌లతో ఈ కాంక్రీట్‌ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ నిల్వ సాధనం సాధారణ బ్యాటరీకి ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. వారి పరిశోధనల ప్రకారం… సౌర శక్తి, గాలి వంటి పునరుద్ధరణీయ మార్గాల నుంచి వచ్చిన విద్యుత్తును నేరుగా వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ సూపర్ కెపాసిటర్ ఉపయోగపడుతుంది.
సోలార్ ప్యానల్స్ సామర్థ్యం జత కలిసిన ఆఫ్‌గ్రిడ్ హౌస్‌గా దీనిని చెప్పవచ్చు. నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి వేళ వాడుకోవచ్చు. కాంగ్రిడ్ పవర్ సిస్టమ్‌తో, యుటిలిటీ కంపెనీతో ఏ విధంగానూ అనుసంధానం జరగని దానిని ఆఫ్‌గ్రిడ్ హౌస్ అంటారు. లిథియం బ్యాటరీలతో పర్యావరణానికి హాని జరుగుతుంది. ఇది పరిమితంగా అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా కార్బన్, సిమెంట్ సూపర్ కెపాసిటర్స్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయి.