పాట్నా: ప్రియుడితో కలిసి పారిపోయేందుకు జవాన్ భార్య ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన అతడు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. (CRPF Jawan Catches Wife Trying To Elope) భార్య ప్రియుడ్ని ఆ జవాన్ కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ భార్య పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. అక్టోబర్ 30న భర్తతో పెద్ద గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి పారిపోయేందుకు పాట్నా రైల్వే స్టేషన్‌కు ఆమె చేరుకున్నది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్, ఆ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ప్లాట్‌ఫారమ్ వద్ద భార్య, ఆమె ప్రియుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యను తిట్టి, కొట్టి హంగామా చేశాడు. అంతా చూస్తుండగా ఆమె ప్రియుడ్ని కూడా పలుమార్లు కొట్టాడు. అయితే ఆ ప్లాట్‌ఫారమ్ వద్ద ఉన్న ప్రయాణికులు ఎవరూ కూడా జోక్యం చేసుకోలేదు. పైగా ఆ జవాన్‌ను కొందరు సపోర్ట్ చేశారు.
మరోవైపు ఆ జవాన్ చివరకు తన భార్యను తీసుకుని రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లాడు. ఆమె ప్రియుడు కూడా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पटना जंक्शन पर पति-पत्नी और आशिक के बीच लड़ाई:CRPF में है पति, बिहार पुलिस में पत्नी, प्रेमी के साथ ट्रेन पकड़ने पहुंची लेडी कांस्टेबल#Bihar #BiharNews #Patna pic.twitter.com/dxogIfrpVb
— FirstBiharJharkhand (@firstbiharnews) October 31, 2024