Crocodile | మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. నడిరోడ్డుపై మొసలి హల్చల్
Crocodile | మహారాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Crocodile | ముంబై : మహారాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షం కురియడంతో.. ఓ మొసలి నడిరోడ్డుపై ప్రత్యక్షమైంది. అయితే ఈ మొసలి స్థానికంగా ఉన్న శివ నదిలో నుంచి బయటకు వచ్చినట్లు వాహనదారులు, పోలీసులు పేర్కొన్నారు. శివ నది మొసళ్లకు నిలయంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వరద ఉధృతికి మొసలి రోడ్డుపైకి వచ్చి ఉండొచ్చని చెప్పారు.
ఇక నడిరోడ్డుపై హల్చల్ సృష్టించిన మొసలిని వాహనదారులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై ప్రత్యక్షమైన మొసలి.. నోరు పెద్దగా తెరుస్తూ ఆహారం కోసం గాలించింది. మరో రెండు రోజుల పాటు రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Scary scenes from Maharashtra’s coastal Ratnagiri district.
A huge #crocodile was seen strolling after heavy rains. pic.twitter.com/26akojSSDx
— Sneha Mordani (@snehamordani) July 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

