Lok Sabha MPs | లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు..!
Lok Sabha MPs | లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యయనంలో వెల్లడైంది.
Lok Sabha MPs | న్యూఢిల్లీ : లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యయనంలో వెల్లడైంది. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదు కాగా, వీరిలో ఐదుగురు బీజేపీకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు కాగా, వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారే కావడం గమన్హారం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
లోక్‌సభ ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ. 100 కోట్లకు పైమాటే. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నకుల్ నాథ్ తొలిస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్(కాంగ్రెస్), రఘురామకృష్ణ రాజు ఉన్నారు. 73 శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

