అహ్మాదాబాద్: క్రికెట్ రవీంద్ర జడేజా భార్య గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జడేజా భార్య రివాబాజడేజా… జామ్నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్ బీజేపీ పార్టీ ఇవాళ 160 స్థానాలకు చెందిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి హర్ష సంఘవి .. మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన హార్ధిక్ పటేల్ .. విరాంగమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ఘట్లోడి స్థానం నుంచి పోటీ చేస్తారు.