న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని లతేర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్(Maoist Encounter) జరిగింది. ఎదురుకాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు హతం అయ్యాడు. అతని తలపై 5 లక్షల నజరానా ఉన్నది. భద్రతా దళాలతో జరిగిన ఫైరింగ్‌లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. ఎరుపు దళానికి చెందిన మరో మవోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌతాదండ్ పోలీసు స్టేషన్ ఫరిధిలో ఉన్న దౌనా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
ఆ మావోయిస్టును మనిశ్ యాదవ్‌గా గుర్తించారు. అతన్ని పట్టిస్తే 5 లక్షలు ఇవ్వనున్నారు. తాజా ఆపరేషన్‌లో మావోయిస్టు కుందన్ ఖేర్వార్ అరెస్టు అయినట్లు డీఐజీ వైఎస్ రమేశ్ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఇద్దరు మావోయిస్టులు హతం అయ్యారు. వారిలో జేజేఎంపీ అధినేత పప్పూ లొహ్ర ఉన్నాడు. అతని తలపై 19 లక్షల నజరానా ఉన్నది.