న్యూఢిల్లీ : కొవిడ్ టీకా నిల్వ గడువును సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పెంచింది. వాక్సిన్ తయారీ తేదీ నుంచి ఏడాది పాటు వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ వ్యాక్సిన్ వినియోగ గడువును 24 నెలలకు పొడగించాలని కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఈ మేరకు సంస్థ టీకాకు సంబంధించిన డేటాను డ్రగ్ రెగ్యులేటర్‌కు సమర్పించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG) బుధవారం కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగ జాబితా (EUL)పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.