చిరుతను చితక్కొట్టి.. భర్తను కాపాడుకొని!
చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్ తహసిల్ దరోడి గ్రామంలో గత శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. దరోడి గ్రామానికి చెందిన గోరఖ్ దశరథ్ పావడే, సంజన పావడే దంపతులు.
- మహారాష్ట్రలోని ఓ మహిళ సాహసం
పుణె, మార్చి 30: చిరుతను దూరం నుంచి చూస్తేనే దడుచుకుంటాం. అలాంటిది దానితో పోరు అంటే పక్కాపరారవుతాం. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని దాడి నుంచి భర్తను కాపాడుకున్నది. ఈ సాహస ఘటన అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్ తహసిల్ దరోడి గ్రామంలో గత శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. దరోడి గ్రామానికి చెందిన గోరఖ్ దశరథ్ పావడే, సంజన పావడే దంపతులు. రోజు మాదిరిగానే కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. బయట అలికిడితో సంజనకు మెలకువ వచ్చింది. బయట చిరుతను గమనించి భర్త దశరథ్ను లేపింది.
భర్త బయటకు వచ్చి చూస్తుండగా.. ఒక్కసారిగా చిరుత అతడిపై దాడిచేసింది. అతడి వీపును పట్టుకొనేందుకు ప్రయత్నించింది. సంజన వెంటనే పరిగెత్తుకొచ్చి చిరుత దాడి నుంచి భర్తను విడిపించేందుకు దాని తోక పట్టుకొని వెనుకకు లాగేందుకు ప్రయత్నించింది. ఈలోగా పెంపుడు కుక్కతో దశరథ్ తండ్రి అక్కడికి వచ్చి కట్టెలు, గ్రానైట్ రాళ్లతో చిరుతను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడిపై చిరుత పట్టుకోల్పోయింది. వెంటనే అతడు దూరంగా జరిగాడు. చిరుత పారిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

