Couple Vote | న్యూఢిల్లీ : తొలి విడుత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్లోని కతువాలో ఓ నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి తంతు ముగిసిన వెంటనే వివాహ వేదిక నుంచి నేరుగా పోలింగ్ సెంటర్కు వచ్చినట్లు నవ దంపతులు పేర్కొన్నారు.
పెళ్లి జరిగిన కాసేపటికే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం ఎంతో సంతోషంగా ఉందని నూతన దంపతులు అసీమ్ మంగోతర, వైశాలి తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. కతువా – ఉధంపూర్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు 22.60 శాతం పోలింగ్ నమోదైంది.