న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారతదేశంలో మొట్టమొదటి ‘ఏఐ ఆధారిత మెడికల్ రోబో’ను కోల్కతా సైంటిస్టులు తయారుచేశారు. రోగులకు సంబంధించిన బీపీ, రక్తంలో గ్లూకోజ్, ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత.. తదితర సమాచారాన్ని తెలుపటం, రోగ లక్షణాలను ముందుగా పసిగట్టడం దీని ప్రత్యేకత. ‘మెడ్ బోట్’గా పిలుస్తున్న ఈ ఏఐ మెడికల్ రోబోను కోల్కతాకు చెందిన దంపతులు డాక్టర్ అంబరీష్ పాల్, డాక్టన్ తానియా ముఖర్జీలు ఇద్దరూ కలిసి అభివృద్ధి చేశారు. పెద్ద సంఖ్యలో రోగులు వచ్చే ఆరోగ్య కేంద్రాల్లో ‘మెడ్ బోట్’ సేవలు కీలకంగా మారుతాయని, వైద్య సేవలు వేగంగా అందుబాటులోకి రావడానికి దోహదపడతాయని వారు చెబుతున్నారు.