శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 07:14:13

భారత్‌లో 11 చేరిన కరోనా మృతుల సంఖ్య..

భారత్‌లో 11 చేరిన కరోనా మృతుల సంఖ్య..

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌.. భారత్‌లోనూ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది. తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదయింది. మధురైలోని రాజాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ధృవీకరించారు. 

కాగా, భారత్‌లో 536 కరోనా పాజిటివ్‌ కేసులు ఉండగా.. 11 మంది బాధితులు చనిపోయారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు.. 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. కరోనా కట్టడికి ఇదే ఏకైక మార్గమని ప్రధాని తెలిపారు. ప్రజలెవరూ గడపదాటి బయటకు రావద్దని ప్రధాని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తేనే ఈ మహమ్మారిని అరికట్టవచ్చని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

లాక్‌డౌన్‌తో దేశంలో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. 


logo