Corbevax Vaccine: కోర్బీవ్యాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి
Corbevax Vaccine: కోర్బీవ్యాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బీఈ కంపెనీ ఆ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ప్రోటీన్ సబ్ యూనిట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించారు. ఎమర్జెన్సీ లిస్టింగ్ కింద ఈ టీకాకు అనుమతి దక్కింది.
హైదరాబాద్: నగరానికి చెందిన బయోలాజికల్ ఈ సంస్థ స్వదేశీయంగా తయారు చేసిన కోర్బీవ్యాక్స్ కోవిడ్ టీకా(Corbevax Vaccine)కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ప్రోటీన్ సబ్ యూనిట్ ఫ్లాట్‌ఫామ్‌పై స్వదేశీయంగా తయారైన తొలి దేశీ కోవిడ్ వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. కోర్బీవ్యాక్స్ టీకాను అత్యవసరం వినియోగం కింద ఇవ్వవచ్చు అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. కోర్బీవ్యాక్స్కు ఇప్పటికే డీసీజీఐ అనుమతి ఉన్నది. ఇప్పటి వరకు సుమారు వంద మిలియన్ల కోర్బీవ్యాక్స్ కోవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి బయోలాజికల్ ఈ సంస్థ అందజేసింది. ఈ టీకాను ఎక్కువగా 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు వాడారు.
తమ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ ఎమర్జెన్సీ లిస్టింగ్ రావడం సంతోషకరమని బీఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ ధాట్ల తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో లిస్టింగ్‌తో తమ కంపెనీ కోవిడ్ 19 టీకాల తయారీ వేగాన్ని పెంచనున్నట్లు ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటానికి తమ వంతు సాయం అందిస్తున్నామన్న విశ్వాసం పెరిగినట్లు ఆమె తెలిపారు. చాలా వరకు దేశాలు కోవిడ్‌ను ఎదుర్కోవడంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అలాంటి ప్రజలకు తమ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ఆమె అన్నారు. అందరికీ అందే రీతిలో, నాణ్యమైన టీకాను అందించడం తమ ఉద్దేశం అని, డబ్ల్యూహెవో అనుమతి దక్కడం ఆ మార్గాన్ని ఈజీ చేస్తుందని మహిమ పేర్కొన్నారు.
28 రోజుల తేడాతో రెండు డోసుల్లో కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఎక్స్‌బీబీ1.5 వేరియంట్‌ను ఢీకొనే నెక్ట్స్ జనరేషన్ కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా బీఈ సంస్థ తయారు చేస్తున్నది. ఆ టీకాకు చెందిన పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం జంతువులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న అన్ని రకాల వేరియంట్లను ఆ నెక్ట్స్ జనరేషన్ వ్యాక్సిన్ ఎదుర్కుంటుందని బీఈ తన ప్రెస్ రిలీజ్లో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

