CWC meeting : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కు శ్రద్ధాంజలి ఘటించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియాగాంధీ (Sonia Gandhi), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తోపాటు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మన్మోహన్ సింగ్ మృతికి సీడబ్ల్యూసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీడబ్ల్యూసీ నేతలు మన్మోహన్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంది.
#WATCH | Delhi: Congress Working Committee (CWC) meeting begins at the AICC headquarters in Delhi in the presence of party president Mallikarjun Kharge, CPP Chairperson Sonia Gandhi, Lok Sabha LoP and MP Rahul Gandhi and other Congress leaders
The meeting has been convened to… pic.twitter.com/6URDXGcYux
— ANI (@ANI) December 27, 2024