karnataka polls : 42 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ రెండవ జాబితా
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (karnataka polls) కాంగ్రెస్ గురువారం 42 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితా ప్రకటించింది.
బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (karnataka polls) కాంగ్రెస్ గురువారం 42 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ నుంచి హస్తం గూటికి చేరిన బాబూరావు చిచన్సూర్, ఎన్వై గోపాలకృష్ణలకు చోటు దక్కింది. బాబూరావు గుర్మిత్కల్ సీటు నుంచి బరిలో దిగనుండగా, గోపాలకృష్ణ మొల్కల్మూర్ నుంచి పోటీ చేయనున్నారు.
బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని పాలక బీజేపీ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లవెత్తడం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అభ్యర్ధుల ఎంపికను ఆచితూచి చేపట్టడంతో పాటు ముఖ్యనేతల మధ్య సమన్వయంతో ముందుకెళుతోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలడంతో దిక్కుతోచని కమలనాధులు సినీ నటులను రంగంలోకి దింపుతున్నారు. కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ ప్రకటించడంపై కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బీజేపీ నేతల ప్రసంగాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో జనం దృష్టిని ఆకట్టుకునేందుకు కాషాయ నేతలు సినీ నటుల కోసం అర్రులుచాస్తున్నారని, ఇది బీజేపీ దివాళాకోరుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు.
Read More
Prakash Raj | సుదీప్ నిర్ణయంతో చాలా బాధపడ్డా : ప్రకాశ్ రాజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

