NewsClick | కులగణన డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై దాడులు : కాంగ్రెస్
చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ (NewsClick) జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లపై ఢిల్లీ పోలీసుల దాడుల ఘటనపై కాంగ్రెస్ స్పందించింది.
న్యూఢిల్లీ : చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ (NewsClick) జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లపై ఢిల్లీ పోలీసుల దాడుల ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. న్యూస్‌క్లిక్ జర్నలిస్ట్‌లపై ఉదయాన్నే దాడులు చేపట్టడం బిహార్‌లో చేపట్టిన కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు.
బిహార్ కులగణనలో సంచలన వివరాలు వెలుగుచూడటం, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో జర్నలిస్టులపై దాడులకు తెగబడి ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలకు తెరలేపిందని పేర్కొన్నారు. కేంద్ర పాలకుల ముందు ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా వారు తప్పించుకునే ధోరణినే ఆశ్రయిస్తారని ట్విట్టర్ వేదికగా పవన్ ఖేరా ఎద్దేవా చేశారు.
ఆగస్ట్ 17న ఉగ్రవాద వ్యతిరేక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణ చట్టం (యూఏపీఏ) కింద ఆగస్ట్ 17న నమోదైన కేసు ఆధారంగా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మంగళవారం ఉదయం ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 30 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల సందర్భంగా పోలీసులు వీరి నుంచి ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌ల డేటా డంప్స్ సహా ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవచ్చని ఈడీ సమాచారం చేరవేసిన నేపధ్యంలో ఈ సోదాలు చేపట్టారు.
Read More :
Murder | లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

