న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ కాంగ్రెస్ను వీడే సూచనలు కనిపిస్తున్నాయి. అధిష్టానం తీరుపై ఆయన ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకమాండ్ నుంచి ప్రోత్సాహం లేదని, ఎదురుచూసి అలసిపోయానని పేర్కొన్నారు. తన దారులు తనకు ఉన్నాయని చెప్పారు.