Mallikarjun Kharge | ఎమర్జెన్సీపై ఎంతకాలం మాట్లాడుతూ పాలన సాగిస్తారు : మోదీని నిలదీసిన ఖర్గే
Mallikarjun Kharge : ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ చీకటి పాలనపై చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు.
Mallikarjun Kharge : ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ చీకటి పాలనపై చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఎంతకాలం కాషాయ పాలకులు పాలన సాగించాలని కోరుకుంటున్నారని ఖర్గే నిలదీశారు.
మీరు దీనిపై 100 సార్లు మాట్లాడతారు..ఎమర్జెన్సీ విధించకుండానే మీరు ఇదంతా చేస్తున్నారు..ఇలా మాట్లాడుతూ ఎంతకాలం పాలించాలని మీరు కోరుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు, అందుకే ఇవాళ అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి నిరసన చేపడుతున్నారని అన్నారు.
కాషాయ పాలకులు అన్ని ప్రజాస్వామ్య నియమ, నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తాము మోదీని కోరుతున్నామని ఖర్గే చెప్పారు. నినాదాలు కాదని, విషయం ప్రధానమని విపక్షాలకు మోదీ చెబుతున్నారని, కానీ వాదన కాదు, ఏకాభిప్రాయం ముఖ్యమని విపక్ష ఇండియా కూటమి ఆయనకు చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Read More :
Russia | రష్యాలో ఉగ్రదాడి.. పోలీసులు సహా 15 మందికిపైగా మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

