Supreme Court: ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ప్యానెల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court: ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమీషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) సీరియస్ అయ్యింది. వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమీషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, ఏజీ మాసిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని, ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు.
కమిటీలు ఏర్పాటు చేసి ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదన్నారు. సీఏక్యూఎం పూర్తిగా పనిచేయలేదని చెప్పడం లేదని, కానీ అనుకున్న రీతిలో ఆ ప్యానెల్ పర్ఫార్మ్ చేయలేదని జస్టిస్ ఓకా వెల్లడించారు. శీతాకాల సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యం నమోదు అయ్యే విషయం తెలిసిందే. పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో వాయు కాలుష్యం జరుగుతున్నది. మీరు తీసుకున్న చర్యల వల్ల కాలుష్యం తగ్గిందాఅని సీఏక్యూఎం చైర్మెన్ రాజేశ్ వర్మను సుప్రీంకోర్టు అడిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

