బెంగళూరు: కారులో దూరిన పామును బయటకు రప్పించేందుకు స్ప్రే చల్లారు. అది మూర్ఛపోవడంతో ఆక్సిజన్ అందించి చికిత్స చేశారు. (Cobra given oxygen) విస్తూపోయే ఈ సంఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో జరిగింది. హట్టి గోల్డ్ మైన్ సమీపంలో ఒక ఎస్యూవీలోకి నాగుపాము దూరింది. దీనిని గమనించిన కొందరు ఆ పామును బయటకు రప్పించేందుకు ఫినైల్ను స్ప్రే చేశారు. అయితే వాసన ఘటుకు ఆ పాము స్పృహ కోల్పోయింది.
కాగా, వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందికి ఈ విషయం తెలిసింది. దీంతో వారు ఆ పామును సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆక్సిజన్ అందించగా ఆ పాము కోలుకుంది. అనంతరం దానిని సమీపంలోని జలదుర్గ అటవీ ప్రాంతంలో వదిలేశారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్పృహ తప్పిన పాముకు ఆక్సిజన్ అందించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.