Alia Bhatt | అలియా భట్ సక్సెస్ సీక్రెట్ అదే..!
తన ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ భామ అలియా భట్ (Alia Bhatt )తెర వెనుక చేసే హార్డ్‌వర్క్, డెడికేషన్ అద్భుతమని ఆమె వర్కవుట్ సెషన్స్ చూస్తే తెలిసిపోతుంది.
ముంబై : తన ఆన్‌స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ భామ అలియా భట్ (Alia Bhatt )తెర వెనుక చేసే హార్డ్‌వర్క్, డెడికేషన్ అద్భుతమని ఆమె వర్కవుట్ సెషన్స్ చూస్తే తెలిసిపోతుంది. నటి, నిర్మాతతో పాటు విజయవంతమైన వ్యాపార వేత్తలా ఆమె బహుముఖంగా ఎదుగుతున్న తీరు వెనుక అలియా భట్ కష్టించే తత్వం దాగుందని ఆమె ఫిట్నెస్ కోచ్ సోహ్రబ్ ఖుష్రుర్షాహి చెబుతున్నారు.
ఫిట్నెస్ నుంచి తనకు దక్కినవన్నింటినీ ఆమె ఎంతో చెమటోడ్చి సొంతం చేసుకున్నదని తన పర్యవేక్షణలో జిమ్‌లో అలియా భట్ బరువులు ఎత్తుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ఏ విషయాన్ని తేలికగా తీసుకోకుండా కష్టపడి పనిచేయడం వల్లే ఆమె స్టార్‌గా వెలుగొందుతోందని రాసుకొచ్చారు.
తెల్లవారుజామున ఐదు గంటలకే లేకి జిమ్‌లో వర్కవుట్స్ చేసి 12 గంటల షూట్‌కు రెడీ అవడం సామాన్యమైన విషయం కాదని, విజయానికి షార్ట్ కట్స్ లేవని, కష్టపడటం ఒక్కటే మార్గమని అలియా భట్ ఫిట్నెస్ కోచ్ రాసుకొచ్చారు.
Read More :
3D Printed Rings | ఫొటోలు, వీడియోలే కాదు చేతికి పెట్టుకునే ఉంగరాలు కూడా త్రీడీలోకి వచ్చేశాయి!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

