3D Printed Rings | ఫొటోలు, వీడియోలే కాదు చేతికి పెట్టుకునే ఉంగరాలు కూడా త్రీడీలోకి వచ్చేశాయి!
3D Printed Rings | కళ్ల ముందు త్రీడీ ప్రపంచం కనిపించడం, వర్చువల్‌గా త్రీడీ లోకాన్ని చూడటం, వస్తువుల్ని త్రీడీ ప్రింటింగ్‌లో సృష్టించడమే కాదు... ఇప్పుడు ఉంగరాలూ త్రీడీ తరహాలో రూపుదిద్దుకుంటున్నాయి. అంగుళీకాల్లో అమరే ఏనుగులూ, చిలుకలూ, నెమళ్లను ఏకంగా త్రీడీ బొమ్మలా పైకి వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు.‘త్రీడీ ఫింగర్ రింగ్స్'...ఇప్పుడు ఉంగరానికి కొత్త సింగారం!
3D Printed Rings | కళ్ల ముందు త్రీడీ ప్రపంచం కనిపించడం, వర్చువల్‌గా త్రీడీ లోకాన్ని చూడటం, వస్తువుల్ని త్రీడీ ప్రింటింగ్‌లో సృష్టించడమే కాదు… ఇప్పుడు ఉంగరాలూ త్రీడీ తరహాలో రూపుదిద్దుకుంటున్నాయి. అంగుళీకాల్లో అమరే ఏనుగులూ, చిలుకలూ, నెమళ్లను ఏకంగా త్రీడీ బొమ్మలా పైకి వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు.‘త్రీడీ ఫింగర్ రింగ్స్’…ఇప్పుడు ఉంగరానికి కొత్త సింగారం!
రోజు వారీ ఆభరణాల్లో అగ్రస్థానం అంగుళీకానిదే. పెద్దగా నగలని ఇష్టపడని వాళ్లు కూడా ఉంగరాన్ని గారం చేస్తారు. నాజూగ్గానైనా సరే ఆ నగను అభిమానంగా ధరిస్తారు. ఇక, ఇప్పుడు స్టేట్మెంట్ రింగ్‌ల కాలం నడుస్తున్నది. ప్రత్యేకసందర్భాల కోసం, విభిన్నమైన దుస్తుల మీదకి ధరించే ఉంగరాలు పెద్ద సైజులో, రంగులూ, రాళ్లతో చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తాయి. పట్టు చీరల మీదికైనా, వన్పీస్ల పైకైనా స్టేట్మెంట్ రింగ్ డిఫరెంట్ లుక్ ఇస్తుంది. అందుకే ఇవి అన్ని వయసుల వాళ్లనూ కట్టిపడేస్తున్నాయి. వాటిలో విభిన్నంగా, ఇప్పుడు త్రీడీ ఫింగర్ రింగ్స్ అబ్బుర పరుస్తున్నాయి.
అదాటున చూస్తే వేలి మీద ఏదో బొమ్మను నిలబెట్టినట్టుగా కనిపిస్తాయి. అందులోనూ జంతువుల బొమ్మలను ఇందులో ప్రత్యేకంగా రూపుదిద్దుతున్నారు. కెంపులూ, పచ్చలూ, వజ్రాలూ పొదిగిన ఏనుగులు, చిలుకలు, నెమళ్లు ఇందులో ఉంటున్నాయి. ప్రతిచోటా విభిన్నత్వాన్ని కోరుకునే వాళ్లకోసం ఊసరవెల్లులూ, కప్పల్లాంటివీ వీటిలో కనిపిస్తున్నాయి. బంగారమే కాదు, వెండి, ఫ్యాన్సీ, రబ్బర్ జువెలరీలో కూడా ఈ త్రీడీ బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. ప్రఖ్యాత నగల దుకాణాలతో పాటు అమెజాన్‌లాంటి ఆన్లైన్ సైట్లలోనూ లభిస్తున్నాయి. మన అభిరుచిని బట్టి నచ్చినవి ఎంచుకుంటే, మనం కూడా త్రీడీ ట్రెండుకు తగ్గట్టు అప్డేట్ అయిపోయినట్టే. సరికొత్త స్టేట్మెంట్ రింగ్‌తో మనదైన స్టేట్మెంట్ ఇచ్చినట్టే!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి




















