e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News ఇంత యంగ్‌గా ఎలా క‌నిపిస్తున్నారు? సీఎం స్టాలిన్‌ను అడిగిన మ‌హిళ‌

ఇంత యంగ్‌గా ఎలా క‌నిపిస్తున్నారు? సీఎం స్టాలిన్‌ను అడిగిన మ‌హిళ‌

చెన్నై: త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ వ‌య‌సు 68 ఏళ్లు. కానీ ఆయ‌న చాలా యంగ్‌గా క‌నిపిస్తుంటారు. అయితే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న్ను ఓ మ‌హిళ ఇదే ప్ర‌శ్న వేసింది. మీరింత యంగ్‌గా ఎలా క‌నిపిస్తున్నార‌ని ఆమె న‌వ్వుతూ ప్ర‌శ్నించింది. దానికి స్టాలిన్ కూడా కాస్త సిగ్గుప‌డుతూనే.. డ‌యిట్ కంట్రోల్ చేస్తూ అంటూ స‌మాధానం ఇచ్చారు. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను డీఎంకే పార్టీ ఆన్‌లైన్‌లో పోస్టు చేసింది.

డీఎంకే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ పార్టీ త‌మ నేత స్టాలిన్‌కు సంబంధించిన ఫిట్‌నెస్ వీడియోల‌ను త‌రుచూ పోస్టు చేస్తూనే ఉన్న‌ది. గ‌త నెల‌లో స్టాలిన్ వ‌ర్కౌట్ చేస్తున్న వీడియోను ఒక‌టి షేర్ చేశారు. జిమ్‌లో రొటీన్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తున్న 37 సెక‌న్ల ఆ వీడియో వైర‌ల్ అయ్యింది. మ‌రో వీడియోలోనూ ఆయ‌న సైకిల్ తొక్కుతూ, సెల్ఫీలు దిగుతూ క‌నిపించారు. త‌న జీవితంలో యోగా కూడా భాగ‌మే అని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్టాలిన్ తెలిపారు. వీలైన‌ప్పుడు మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వరాళ్ల‌తోనూ ఆడుకుంటాన‌ని చెప్పారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement