Tamil Nadu Assembly: ఆ బిల్లులను పునర్ పరిశీలించండి.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ సీఎం స్టాలిన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఆమోదం పొందిన 10 బిల్లలను మళ్లీ పరిశీలించాలని గవర్నర్ రవిని కోరారు. ఎటువంటి కారణాలు వెల్లడించకుండానే గవర్నర్ తమ బిల్లులను వెనక్కి పంపినట్లు స్టాలిన్ ఆరోపించారు. అసెంబ్లీని, ప్రజల్ని గవర్నర్ రవి అవమానిస్తున్నట్లు తెలిపారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ(Tamil Nadu Assembly)లో ఇవాళ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ఆ తీర్మానాన్ని తీసుకువచ్చారు. గతంలో ఆమోదం పొందిన సుమారు 10 బిల్లలను పాస్ చేసే విధంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానంలో సీఎం స్టాలిన్ కోరారు. ఎటువంటి కారణాలు లేకుండానే గవర్నర్ రవి తమ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను తిప్పి పంపినట్లు స్టాలిన్ ఆరోపించారు. 2020, 2023లో రెండు బిల్లులకు ఆమోదం దక్కిందని, మరో ఆరు బిల్లులు గత ఏడాది పాస్ చేశామని, కానీ ఇంత వరకు గవర్నర్ ఆ బిల్లులకు ఓకే చెప్పలేదని స్టాలిన్ పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం ఆ బిల్లులను మళ్లీ పాస్ చేశామని, తమిళనాడు అసెంబ్లీ రూల్ 143 ప్రకారం కూడా బిల్లులకు ఆమోదం దక్కిందని స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గవర్నర్ రవి అడ్డుకుంటున్నట్లు సీఎం స్టాలిన్ ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ తమ బిల్లులను వెనక్కి పంపారని, ఇది అప్రజాస్వామికమని సీఎం అన్నారు.
నాన్ బీజేపీ రాష్ట్రాలను కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తిక చేసుకోవాలని, కానీ ఆ బిల్లులకు ఆమోదం ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. అసెంబ్లీని, ప్రజల్ని గవర్నర్ రవి అవమానిస్తున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

