Chlorine Gas Leak | క్లోరిన్ గ్యాస్ లీకేజ్.. 56 మందికి అస్వస్థత.. నాగ్‌పూర్‌లోని నీటిశుద్ధి కేంద్రంలో ఘటన
నాగ్‌పూర్‌లోని గోధాని గ్రామంలో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 1గంటకు నీటిశుద్ధి కేంద్రంలోని 900 కిలోల సామర్థ్యం గల సిలిండర్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీకేజీ మొదలైంది.
- నాగ్‌పూర్‌లోని నీటిశుద్ధి కేంద్రంలో ఘటన
ముంబై : నాగ్‌పూర్‌లోని గోధాని గ్రామంలో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్ గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 1గంటకు నీటిశుద్ధి కేంద్రంలోని 900 కిలోల సామర్థ్యం గల సిలిండర్ నుంచి క్లోరిన్ గ్యాస్ లీకేజీ మొదలైంది. సమీప నివాసాలకు గ్యాస్ వ్యాపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అనేక మంది దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.
నీటిశుద్ధి కేంద్రానికి సుమారు 200 మీటర్ల పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 56 మంది అస్వస్థతకు గురవడంతో దవాఖానకు తరలించారు. ఇందులో 45 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగి గ్యాస్‌ను అదుపు చేస్తున్నట్టు నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

