CBI raids on TMC MLA | పశ్చిమ బెంగాల్లో చిట్ఫండ్ స్కామ్ దర్యాప్తులో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలను వెంటాడుతున్నది. ఇందులో భాగంగా ఆదివారం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబోధ్ అధికారి, కమల్ అధికారి నివాసాల్లో తనిఖీలు జరిపింది. ఇదే కేసులో హలీసహార్ మున్సిపల్ కార్పొరేసన్ చైర్మన్ రాజు సహానీని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సుబోధ్ అధికారికి చెందిన పలు ప్రాంతాలతోపాటు రాజు సహానీ నివాసాల్లో సీబీఐ తనిఖీలు కొనసాగాయి.
గత నెలలో గోవుల స్మగ్లింగ్ కేసులో తృణమూల్ నాయకుడు, ఆ పార్టీ బిర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మొండల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. తాము జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడం వల్లే అనుబ్రత మొండల్ను అరెస్ట్ చేశామని సీబీఐ తెలిపింది. 2015 డిసెంబర్ నుంచి 2017 ఏప్రిల్ మధ్య మాల్డాలోని బంగ్లా సరిహద్దు పొడవునా స్మగ్లింగ్ చేస్తున్న 20 వేలకు పైగా గోవులను సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకున్నది.