Chiranjeevi | పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడుతున్నారు: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్మహారాజ రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాద్లో ద్విశతదినోత్సవ వేడుకను నిర్వహించారు.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మాస్మహారాజ రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాద్లో ద్విశతదినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ గతకొన్నేండ్లుగా సినీపరిశ్రమను చుట్టుముడుతున్న రాజకీయాంశాలను ప్రస్తావించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు 2-3 వారాలు ఆడితే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శితమవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోంది, చరిత్రను మళ్లీ తిరగరాసినట్లుందని ఎమోషనల్ అయ్యారు.

చిరంజీవి మరో మూడు రోజుల్లో భోళాశంకరుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినమా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది.

The MEGA MASS 💥UNION 🤩🤩
Megastar @KChiruTweets & Mass Maharaja @RaviTeja_offl from the Mega Mass Blockbuster #WaltairVeerayya 200 days celebrations 🎉🥳#200DaysOfWaltairVeerayya @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @ArthurWisonA #ASPrakash @konavenkat99 pic.twitter.com/Jdcma9GL9g
— h (@TeamBobby4u) August 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

