పావురం కాలికి చిప్.. గూఢచర్యమేనా..!
Chip fitted Pigeon: గుజరాత్లో ఓ పావురం కలకలం రేపింది. వడోదర పట్టణంలో ఓ పావురం కాలికి ఫింగర్ రింగ్ ఉండటాన్ని గమనించి స్థానికులు పట్టుకున్నారు.

అహ్మదాబాద్: గుజరాత్లో ఓ పావురం కలకలం రేపింది. వడోదర పట్టణంలో ఓ పావురం కాలికి ఫింగర్ రింగ్ ఉండటాన్ని గమనించి స్థానికులు పట్టుకున్నారు. ఆ రింగులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పావురాన్ని పరిశీలించారు. దాని కాలికి ఉన్న రింగ్‌ను, ఆ రింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ చిప్‌ను వేరు చేసి పరీక్షల కోసం గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు. పావురాన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
అయితే, ఆ పావురం పొరుగు దేశం పాకిస్థాన్ గూఢచర్యం కోసం పంపినదా లేదంటే ఎవరైనా పరిశోధన కోసం దానికి కాలికి చిప్ అమర్చారా..? అనే కోణంలో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. కాగా, గత ఏడాది మే నెలలో కూడా జమ్ముకశ్మీర్ రాష్ట్రం కథువా జిల్లాలో కాలికి కాగితం ముక్కతో కనిపించిన ఓ పావురం కలకలం రేపింది. అయితే, అది పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పావురమని దర్యాప్తులో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వరుసగా రెండో రోజూ 4 లక్షలు దాటిన కరోనా కేసులు
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్
పురివిప్పిన మయూరం.. కనువిందు చేసిన నాట్యం.. వీడియో
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

