న్యూఢిల్లీ, మే 30: సిక్కింకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే చైనా తన అత్యంత అధునాతన జీ-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. మొత్తంగా 6 ఫైటర్ జెట్లు ఉన్నట్లు ఈ నెల 27న సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఆ ఫైటర్ జెట్లు ఉన్న ప్రాంతం టిబెట్‌లోని షిగాట్సే విమానాశ్రయంలో ఉన్నాయి. ఈ విమానాశ్రయం సముద్ర మట్టానికి 12,408 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న విమానాశ్రయం ఇది. అయితే, దీనిపై స్పందించటానికి భారత వాయుసేన నిరాకరించింది.
దాదాపు 372 మైళ్ల ఎత్తులో చైనా అంతరిక్ష విమానం ద్వారా ఒక రహస్యమైన వస్తువును భూమి కక్ష్యలోకి విడుదల చేసింది. దీన్ని హార్వర్డ్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఒకరు గుర్తించారు. దీన్ని అమెరికా స్పేస్ ఫోర్స్ పర్యవేక్షిస్తున్నది. అయితే, ఎందుకు ఈ రహస్య వస్తువును భూ కక్ష్యలోకి విడుదల చేసిందన్నది తెలియరాలేదు.