న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. సోమవారం జరిగిన పార్లమెంట్ మార్చ్ కూడా ఉద్రిక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) ఆ అంశంపై స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షణను అమలు చేయాలన్నారు. పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా చూసుకోవడం దేశ బాధ్యతగా భావించాలని ప్రధాని అన్నారు. ఇవాళ ఎన్డీఏ ఎంపీలతో జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన మంగల్ మిలన్ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దోషరహిత పరీక్షా వ్యవస్థను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రధాని మోదీ కోరినట్లు మంత్రి రిజిజు వెల్లడించారు.
నీట్ రీఎగ్జామ్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు ఫలితాలను కూడా జాప్యం లేకుండా రిలీజ్ చేసినట్లు మోదీ పేర్కొన్నట్లు మంత్రి రిజిజు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో నీట్ పేపర్ లీకేజీ కాకుండా కఠిన చర్యలు చేపట్టామని, దీనిలో భాగమైన వారిఇ అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లినట్లు చెప్పారు. యువత భవిష్యత్తుతో ఆడుకునేవారికి కఠిన శిక్ష అమలు చేయనున్నట్లు ప్రధాని చెప్పారు.
సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఎన్డీఏ భాగస్వామ్యులు ఐక్యంగా ఉండాలని ప్రధాని చెప్పినట్లు తెలిసింది. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నా.. దేశ భవిష్యత్తు, యువత సంక్షేమ కోసం ఎంపీలు అందరూ కలిసి పనిచేయాలని మోదీ అన్నారు. చిన్న పిల్లలను రెచ్చగొట్ట వద్దు అన్నారు. వారికి సరైన దారిని చూపించాలని ప్రధాని అన్నారు. చెడు మార్గంలో వెళ్లడం సులువుగా ఉంటుందని, కానీ మళ్లీ మంచి మార్గాన్ని అనుసరించడం ఆలస్యం అవుతోందన్నారు. విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే బాధ్యత మనమీదే ఉందని, అది మన బాధ్యత అని ప్రధాని మోదీ అన్నారు. యువతను తప్పుదారి పట్టించారని, వారిని రెచ్చగొట్టవద్దు అని, వారికి సరైన మార్గాన్ని చూపించాలన్నారు. యువతకు గైడెన్స్ ఎలా ఇవ్వాలన్న అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారని మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు.
#WATCH | Delhi | On National Democratic Alliance (NDA) Parliamentary Party Meeting, Union Minister & LJP President Chirag Paswan says, “The PM spoke about the country’s youth and how they should get correct guidance. He also shared the experiences of the youth of the country who… pic.twitter.com/wJCWbDBEuA
— ANI (@ANI) July 21, 2026