చెక్కు చెల్లింపుల్లో మోసాలకు చెక్

- కొత్తగా ‘పాజిటివ్ పే’ విధానం
- చెక్కు క్లియరెన్స్‌కు రీ కన్ఫర్మేషన్
- రూ.5 లక్షలు దాటితే తప్పనిసరి
న్యూఢిల్లీ, ఆగస్టు 29: చెక్కుల ద్వారా చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ ‘పాజిటివ్ పే’ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో చెక్కు జారీ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం, చెక్కు డ్రా చేసుకొంటున్న వ్యక్తి ఇచ్చిన సమాచారం సరిపోలితేనే అధికారులు చెక్కును క్లియర్ చేస్తారు. లేకపోతే నిలిపివేస్తారు. చెక్కు జారీచేసే వ్యక్తి ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ఇలా పలు మార్గాల ద్వారా వివరాలను బ్యాంకుకు తెలుపవచ్చు. చెక్కు జారీ చేసిన వ్యక్తికి తెలియకుండా వాటిల్లో పేర్లు, అంకెలు మార్చి ఎక్కువ నగదును విత్‌డ్రా చేసుకొంటున్న ఘటనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది రీ కన్ఫర్మేషన్ ద్వారా చెక్కులను క్లియర్ చేయడం అన్నమాట. పాజిటివ్ పే విధానంలో చెక్కు జారీ చేసే వ్యక్తి ముందుగా చెక్కు నంబర్, ఎవరి పేర ఇస్తున్నాడో వారి పేరు, నగదు మొత్తం, చెక్కు జారీ చేసిన తేదీ తదితర వివరాలను బ్యాంకుకు తెలియజేయాలి. చెక్కును తీసుకొన్న వ్యక్తి దాని క్లియరెన్స్ కోసం వెళ్లినప్పుడు పై వివరాలను చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్-చెక్కు మార్పిడి వ్యవస్థ) ద్వారా పరిశీలిస్తారు. ఇద్దరి వివరాలు సరిపోలితే చెక్కు క్లియర్ చేస్తారు. ఈ విధానాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. అయితే, రూ.5లక్షల లోపు చెక్కులకు పాజిటివ్ పే విధానాన్ని అమలు చేయడం అనేది బ్యాంకులు, ఖాతాదారుల ఇష్టం. ఖాతాదారులు కోరుకొంటే బ్యాంకులు అమలు చేయవచ్చు. కానీ చెక్కు విలువ రూ.5 లక్షలు దాటితేమాత్రం పాజిటివ్ పే విధానం తప్పనిసరి. చెక్కుజారీ చేసిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోతే చెక్కు బౌన్స్ కావచ్చు. ఇప్పటికే యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ లాంటి కొన్ని బ్యాంకులు పాజిటివ్ పే విధానాన్ని అమలు చేస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- check
- fraud
- rbi
- transactions
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

