న్యూఢిల్లీ: ఓపెన్ఏఐకి చెందిన చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గురువారం అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం ఓపెన్ఏఐకి చెందిన ఏపీఐ, సోరా ప్లాట్‌ఫామ్స్‌పై కూడా పడింది. దీంతో యూజర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రస్తుతం చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం కలుగుతున్నదని, సమస్యను గుర్తించామని ఓపెన్ఏఐ ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది.
ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పింది. ఏపీఐపై ఆధారపడిన సంస్థలు కూడా ఎక్స్ వేదికగా తమ ఆవేదనను పంచుకున్నాయి. లాగిన్ ప్రాసెస్ స్లో అయిందని, పనితీరు క్షీణించిందని తెలిపాయి. చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్ అయిందని ఫిర్యాదులు పెరుగుతున్నట్లు డౌన్‌డిటెక్టర్ అనే ఔటేజ్ మానిటరింగ్ సర్వీస్ తెలిపింది.