Raj Bhavan name change | ‘ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ముఖ్యం’.. రాజ్ భవన్ పేరు మార్పుపై స్టాలిన్ విమర్శ
Raj Bhavan name change | గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ పేరును ‘లోక్ భవన్’గా మార్చాలన్న ప్రతిపాదనను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ చర్యకు సిఫార్సు చేయడంపై మండిపడ్డారు.
చెన్నై: గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ పేరును ‘లోక్ భవన్’గా మార్చాలన్న ప్రతిపాదనను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. (Raj Bhavan name change) కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ చర్యకు సిఫార్సు చేయడంపై మండిపడ్డారు. ముందు ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం లేనప్పుడు రాజ్ భవన్ పేరు మార్పు చర్య అనవసరమని ఎక్స్‌లో పేర్కొన్నారు.
కాగా, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల అధికారాన్ని గౌరవించడంలోనే నిజమైన జవాబుదారీతనం ఉంటుందని సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘పేరు మార్చడం అనేది మనస్తత్వాన్ని మార్చడం కంటే తక్కువే. శాసనసభ అనేది ప్రజల సభ. శాసనసభను గౌరవించని వారికి, లోక్ భవన్‌గా పేరు మార్చడం కేవలం సంజ్ఞా? ప్రజాస్వామ్య సూత్రాల కళ్లలో ఇసుక వేయడమేనా?’ అని ప్రశ్నించారు.
మరోవైపు ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాలను, ప్రజల అభీష్టాన్ని నెరవేర్చే సార్వభౌమ శాసనసభను గౌరవించడం ప్రస్తుతం అవసరమని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ ఆలోచన, ఆ చర్యలో మార్పు లేకపోతే రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చడం అనవసరమని విమర్శించారు. శాసనసభ పాత్రను సమర్థించని వారు గవర్నర్ నివాసం పేరును మార్చడం ద్వారా ఆ విలువను భర్తీ చేయలేరని ఆయన మండిపడ్డారు.
Also Read:
SIR Deadline Extended | ‘సర్’ గడువు వారం రోజులు పొడిగింపు.. ఫిబ్రవరి 14న తుది జాబితా
all-party meet | అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం.. పలు అంశాలపై గళమెత్తనున్న ప్రతిపక్షం
14 Bills To Be Introduced | పార్లమెంట్లో 14 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం.. అవి ఏవంటే?
Woman Raped in Car | మహిళను కారులోకి లాగి, మద్యం తాగించి.. సామూహిక అత్యాచారం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

