న్యూఢిల్లీ: విద్యార్థుల సామర్థ్యా న్ని, యోగ్యతను పరీక్షించేలా సీబీఎస్ఈ 11, 12 తరగతుల పరీక్షల్లో మార్పులు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు గురువారం వెల్లడించారు. పుస్తక జ్ఞానా న్ని నిజ జీవిత పరిస్థితులకు అన్వయిస్తూ ప్రశ్నలుంటాయని, ఇందు కు సంబంధించిన ప్రశ్నల సంఖ్య పెంచామని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. కొత్త ఫార్మాట్లోని పరీక్షలు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇక 9, 10 తరగతుల పరీక్షల తీరులో ఎలాంటి మార్పులూ లేవన్నారు.