CERT-In | గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న విండోస్, మాక్ యూజర్లను కేంద్రం హెచ్చరించింది. గూగుల్ క్రోమ్‌లో పలు లోపాలు ఉన్నాయని.. వాటిని హ్యాకర్స్‌కు అవకాశంగా మారే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) పేర్కొంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్ యూజర్స్‌తో పాటు మ్యాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గూగుల్ క్రోమ్‌లోని లోపాలతో ఆయా కంప్యూటర్స్ హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉంటుందని చెప్పింది. సమాచారాన్ని తస్కరించే అవకాశాలుంటాయని పేర్కొంది. హ్యాకర్స్ నుంచి తప్పించుకునేందుకు యూజర్లు తప్పనిసరిగా క్రోమ్‌ని అప్డేట్ చేయాలని సూచించింది. క్రోమ్ సెక్యూరిటీ ప్యాచ్‌లు వస్తే.. వెంటనే అప్డేట్ చేయాలని చెప్పింది. ముఖ్యంగా.. 136.0.7103.48/49కి ముందు వెర్షన్ గూగుల్ క్రోమ్‌ని వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేయాలని చెప్పింది.
విండోస్, మ్యాక్ ఓఎస్లోయూజర్లు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని తెలిపింది. హెచ్‌టీఎంఎల్‌లో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, అవుట్ ఆఫ్ బౌండ్స్ మెమరీ యాక్సెస్, DevToolsలో లోపాల కారణంగా హ్యాకర్లు వాటిని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. దాంతో సున్నితమైన డేటాను యాక్సెస్ చేయడంతో పాటు సిస్టమ్‌ని వారి నియంత్రణలోకు తీసుకునే అందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే, లినక్స్ (Linux ) ఓఎస్‌లో గూగుల్ క్రోమ్ 136.0.7103.59 వర్షెన్లకు ముందు వాడే వారంతా లేటెస్ట్ బ్రౌజర్‌కు మారాలని లేకపోతే.. అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ విషయంలో గూగుల్‌కు సమాచారం అందడంతో సెక్యూరిటీ ప్యాచ్‌లు విడుదల చేసిందని తెలిపింది. Chrome ని అప్డేట్ చేసేందుకు.. ఎగువ కుడి వైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో ఎడమవైపు కింద ఎబౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్ బ్రౌజర్ అప్డేట్ అవుతుంది.