దేశద్రోహ చట్టానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సవరణ
Union Government | వివాదాస్పదంగా మారిన బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టానికి వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సవరణలు చేసే అవకాశం ఉన్నదని
- సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: వివాదాస్పదంగా మారిన బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహ చట్టానికి వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సవరణలు చేసే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. భారత శిక్షాస్మతిలోని సెక్షన్ 124 (ఎ) కింద దేశద్రోహ చట్టాన్ని చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసినా సదరు నేరస్తులుగా పరిగణించబడుతారు.
ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దేశద్రోహ చట్టాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాయి. అందుకే ఈ చట్టానికి సవరణలు చేయాలని ఏండ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. దేశద్రోహ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. చట్టానికి సవరణలు చేయాలని గత మే నెలలోనే ఆదేశించింది.
అంతేగాక, దేశద్రోహ చట్టంపై కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేవరకు.. కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఎవరిమీదా ఈ చట్టాన్ని ప్రయోగించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు స్టేపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్ర పిటిషన్ దాఖలు చేసినా.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

