డీలిమిటేషన్‌కు మళ్లీ బిల్లు.. ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్‌సభలో గత ఏప్రిల్‌లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీయే సర్కారు దృఢనిశ్చయంతో ఉన్నదా?
- కేంద్ర వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు
- తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మారిన రాజకీయ పరిణామాలపై ఆశలు పెట్టుకున్న మోదీ సర్కార్
- మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోగలమనే ధీమాలో ఎన్డీయే
- 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే పునర్విభజన, మహిళా బిల్లులను ఆమోదింపజేసుకోవాలని కసరత్తు
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్‌సభలో గత ఏప్రిల్‌లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీయే సర్కార్ దృఢనిశ్చయంతో ఉన్నదా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగానే, ఈ నెలాఖరున పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి అధికార ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అధికారవర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్‌సభలో గత ఏప్రిల్‌లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీయే సర్కారు దృఢనిశ్చయంతో ఉన్నదా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ బిల్లు, ఒక దేశం, ఒక ఎన్నిక బిల్లు (జమిలి) రెండింటికీ పార్లమెంటరీ ఆమోదం పొందాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా కార్యచరణను సిద్ధం చేస్తున్నట్టు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగానే, ఈ నెలాఖరున పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి అధికార ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అధికారవర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి.
ఇప్పుడే ఎందుకు?
ఐదు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు గణనీయంగా మారిపోయాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పదిహేనేండ్ల పాలనకు గండికొట్టి పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదేసమయంలో ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన టీఎంసీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయగా, మరో 20 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు అధికార పక్షంలో చేరారు. ఇక, మహారాష్ట్రలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా ఇదే బాటలో నడిచారు. ఇటు తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం దిగిపోవడం, కాంగ్రెస్ వెన్నుపోటు రాజకీయాలను గ్రహించిన స్టాలిన్ పార్టీ ఇండియా కూటమి నుంచి బయటకు రావడం సంచలనంగా మారింది. గత ఏప్రిల్‌లో డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు టీఎంసీ నుంచి 29 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. అప్పుడు ఇండియా కూటమిలో ఉన్న టీఎంసీ, డీఎంకే పార్టీల ఆదేశాల ప్రకారం ఆయా ఎంపీలు ఇలా చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్-డీఎంకే కూటమి విచ్ఛిన్నమవ్వడంతో బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 8 మంది ఎంపీల బలమున్న ఎన్సీపీ (ఎస్పీ)తో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
మ్యాజిక్ ఫిగర్ ఇలా..
డీలిమిటేషన్ జరుగాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 360 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే.. 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. కానీ అధికార ఎన్డీయేకి ఉభయ సభల్లో ఇప్పుడు అంత బలం లేదు. లోక్‌సభలో ఎన్డీయేకి ప్రస్తుతం 319 (20 మంది టీఎంసీ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలతో కలిపి) మంది సభ్యుల మద్దతు ఉండగా, రాజ్యసభలో 151 మంది సభ్యుల మద్దతు ఉంది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

