న్యూఢిల్లీ: లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) కింద తేజస్, వందేభారత్, హమ్సఫర్ రైళ్లలో కేంద్ర ఉద్యోగులు ప్రయాణించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఎల్టీసీ కింద వివిధ ప్రీమియం రైళ్లలో ప్రయాణించడానికి అనుమతించాలని కోరుతూ వివిధ కార్యాలయాలు, వ్యక్తుల నుంచి సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ)కి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది.
వ్యయ శాఖతో సంప్రదింపుల ద్వారా ఈ అంశాన్ని అధ్యయనం చేసిన డీఓపీటీ.. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు తేజస్, వందేభారత్, హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా ఎల్టీసీని విస్తరించాలని నిర్ణయించింది.