Krishna Water Dispute | కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి కీలక సమావేశం..!
Krishna Water Dispute | కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జలశక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుపనున్నది.
Krishna Water Dispute | కృష్ణా జలాల వివాదంపై ఈ నెల కేంద్ర జల్‌శక్తి కీలక సమావేశం నిర్వహించనున్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుపనున్నది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం వీడియో సమావేశం జరిపారు.
తెలంగాణ సీఎస్ సమావేశానికి హాజరుకాలేనని.. సమావేశం తేదీ మార్చాలని కోరగా.. ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించి 6న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. అప్పటి వరకు రెండు రాష్ట్రాలు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ సూచించారు. అదే విధంగా నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంట్‌పై ఈ నెల 4న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి సూచించారు.
అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. 6న అన్ని అంశాలపై చర్చించి వివాద పరిష్కారానికి కృషి చేస్తానని, అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయవనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

