కేంద్ర క్యాబినెట్ కమిటీల ఏర్పాటు
పలు క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలలో దేశ అత్యున్నత నిర్ణయాధికారులు సహా వివిధ క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు.
- తెలుగు మంత్రులిద్దరికి చోటు
న్యూఢిల్లీ, జూలై 3: పలు క్యాబినెట్ కమిటీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, రక్షణ, రాజకీయ వ్యవహారాలలో దేశ అత్యున్నత నిర్ణయాధికారులు సహా వివిధ క్యాబినెట్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికార నోటిఫికేషన్ను జారీ చేశారు.
నియామకాల క్యాబినెట్ కమిటీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఉంటారు. అలాగే భద్రతా వ్యవహారాల కమిటీలో ప్రధాని మోదీ సహా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉంటారు.
కేంద్ర క్యాబినెట్ కమిటీ సభ్యులుగా తెలుగు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కింజారపు రామ్మోహన్ నాయుడులకు స్థానం దక్కింది. పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీలలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కగా, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా రామ్మోహన్ నాయుడుతోపాటు కిషన్ రెడ్డికి స్థానం లభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

