మా దగ్గర వృథా కాలేదు.. మీ లెక్కలే తప్పు!

రాంచి: జార్ఖండ్‌లో 37.3 శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయన్న కేంద్రం ఆరోపణలపై జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొవిన్ పోర్టల్‌లో వ్యాక్సిన్ వృథా గణాంకాలు తప్పుల తడకగా ఉన్నాయని, ముందు వాటిని సరిచేయాలని స్పష్టంచేసింది. తాము పంపిన డాటా ఆధారంగా గణాంకాలు సరిచేస్తే, రాష్ట్రంలో టీకాల వృథా 4.63 శాతం కంటే తక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది జాతీయ సగటు (6.3 %) కంటే తక్కువేనని పేర్కొన్నారు.
వ్యాక్సిన్ల వృథాపై బీజేపీ ఆరోపణలు అవాస్తవం: గెహ్లాట్
రాజస్థాన్‌లో 11.5 లక్షల డోసులు వృథా అయ్యాయని బీజేపీ చేసిన ఆరోపణలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కొట్టివేశారు. బీజేపీ అసత్య ప్రచారాలతో రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ నెల 26 వరకు 1.63 కోట్ల మందికి టీకాలు అందించామని, 3.38 లక్షల డోసులు వృథా అయ్యాయన్నారు.
ఆ కంపెనీలకు లబ్ధి కోసమే టీకాల కృత్రిమ కొరత
న్యూఢిల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృత్రిమంగా వ్యాక్సిన్ల కొరత సృష్టిస్తున్నదని ఆమ్ఆద్మీపార్టీ ఆరోపించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆతిషి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇదో పెద్ద రాకెట్. యువతకు ఉచితంగా టీకా అందించే ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సిన్లకు కొరత ఉన్నది. కానీ ప్రైవేట్ దవాఖానల్లో మాత్రం అధిక ధరలకు వ్యాక్సిన్లు దొరుకుతున్నాయి. మరిన్ని కంపెనీల వ్యాక్సిన్లకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు. ఫైజర్‌కు 85 దేశాలు, మోడెర్నా టీకాకు 46 దేశాలు, జే అండ్ జే వ్యాక్సిన్‌కు 41 దేశాలు అనుమతులు ఇచ్చాయి. వాటికి మన దేశంలో ఎందుకు అనుమతులు ఇవ్వలేదు. సీరం, భారత్ బయోటెక్‌లకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం వ్యాక్సిన్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని’ ఆమె ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

