న్యూఢిల్లీ: పిల్లల్లో మెదడు క్యాన్సర్‌కు కార్ టీ సెల్ చికిత్స ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఈ చికిత్స కణితులను తగ్గించడమే కాకుండా పలువురు రోగుల్లో నాడీ జీవ సంబంధ విధులను పునరుద్ధరించింది. ఓ యువ రోగిలో నయం కాని డిఫ్యూస్ ఇంట్రిన్సిక్ పాంటైన్ గ్లియోమ అనే క్యాన్సర్ జాడలను తొలగించింది.
స్టాన్‌ఫర్డ్ మెడిసిన్‌లో చేసిన ట్రయల్స్‌లో 11 మందిలో 9 మంది కణితుల పరిమాణం తగ్గింది.